Palla Rajeshwar Reddy | పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Palla Rajeshwar Reddy | తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉద్యమం నుంచి తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Palla Rajeshwar Reddy | తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఉద్యమం నుంచి తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో విలువలు పాటించాలని అన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచాక ఐదేండ్లు అందులోనే ఉండాలని పేర్కొన్నారు. పార్టీ మారాలని తనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నదని తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో తనపై నాలుగైదు కేసులు పెట్టారని.. విచారణ పేరుతో కమిటీలు వేశారని.. తనతో పాటు భార్య నీలిమ, కొడుకు అనురాగ్‌పై కూడా కేసులు నమోదు చేశారని చెప్పారు. అరెస్టులు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఎదురించి పోరాడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లోకి రాకముందు జేఏసీతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని, అప్పుడు కూడా కేసులు నమోదయ్యాయని చెప్పారు. తనకు కేసులు కొత్త కాదని తెలిపారు.
కాళేశ్వరం అద్భుతమైర ప్రాజెక్ట్ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనియాడారు. నిపుణుల సలహాతో దాన్ని నిర్మించార.. కానీ అవగాహన లేమితో కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఈ విషయం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని చెప్పారు. కేసీఆర్ శ్వాస, ధ్యాస తెలంగాణే అని అన్నారు. తెలంగాణ తలెత్తుకుని నిలబడేలా కేసీఆర్ చేశారని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- KCR
- meet and greet
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

