సుప్రీంకోర్టులో కృష్ణా ట్రిబ్యునల్ కేసు వాయిదా

హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీలో జరిగిన అన్యాయంపై అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం విచారించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ వాయిదా పడింది. కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం విచారణ జరిపేందుకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించగా దానిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం జలాల పంపిణీ చేపట్టేలా ట్రిబ్యునల్‌ను ఆదేశించాలని కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాన్ని కోరగా, పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా అప్పటికే కోర్టు సమయం మించిపోవడంతో కేసు వాయిదా పడింది. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చే అవకాశముందని తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bird Flu Vaccine | బర్డ్ ఫ్లూ నివారణకు స్వదేశీ టీకా..! భోపాల్‌లోని ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సృష్టి
Cyberabad Events | దావత్‌లపై ఆంక్షలు..! సైబరాబాద్‌లో పార్టీలు, ఫంక్షన్లకు చెక్!
Indiramma Saree Scheme | చీరలు వాయిదా.. బీమా నో ఫాయిదా.. వస్త్రం తయారు కాకుండానే పంపిణీకి సిద్ధం
Raj Gopal Reddy | నువ్వేం సీఎం? నీదేం భాష?.. నీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
Harish rao | క్రీడారంగంపై సర్కార్ చిన్నచూపు : హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

