Medaram | మేడారంలో కొనసాగుతున్న ట్రాఫిక్‌జామ్.. కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వ యంత్రాంగం
Medaram | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి, వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి
Medaram | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి, వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి.
ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వాహనాల, భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఉపయోగించిన ఆధునిక టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఏ మాత్రం ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. మేడారం నుంచి పసరాకు చేరేందుకు 10 గంటల సమయం పడుతోంది. పసరా నుంచి తాడ్వాయి చేరుకునేందుకు మరో నాలుగు గంటల సమయం పడుతోంది.
భక్తులపై ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు
మేడారం భక్తులను ఆర్టీసీ నిలువుదోపిడీ చేసింది. జాతర కోసం ఏర్పాటు చేసిన 4వేల బస్సుల ద్వారా ఒక్కో ప్రయాణికుడి నుంచి 50శాతం అదనంగా చార్జీలు వసూలు చేసింది. 2024జాతరకు 17లక్షల మంది 3,491 బస్సుల ద్వారా ప్రయాణం చేయగా.. ఈ సారి 20 లక్షలకు పైగానే భక్తులు 4వేల బస్సుల ద్వారా ప్రయాణం చేసినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. జీరో టిక్కెట్లు మినహా ఒక్కో టిక్కెట్‌పై 50శాతం అదనంగా వసూలు చేశారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ సిటీ నుంచి మొత్తం 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లతో ఈ ప్రత్యేక బస్సులు తిప్పినట్లు చెప్పారు. ఆర్టీసీలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ బస్సుల ద్వారా 50శాతం వరకూ అదనంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు 2003లో జారీ చేసిన జీవో 16ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉటంకిస్తున్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

