ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కొడంగల్, మార్చి 30 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులను కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కల్యాణ మండపానికి మంత్రి భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆలయాల అభివృద్ధికి విస్తృతమైన కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. వందల కోట్లతో ఆలయాల అభివృద్ధి, వసతుల కల్పన చేపడుతున్నామని వివరించారు.

గడిచిన ఏడేండ్లలో పలు ఆలయాల అభివృద్ధికి కృషి చేశామని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం అబ్బురపడేలా పునఃనిర్మించుకుని ప్రారంభించుకున్నామన్నారు. అదేవిధంగా వేములవాడ, బాసర, కాళేశ్వరం, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఆలయాలకు నిధులు ఇవ్వలేదన్నారు.
శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంత్రి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

