హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): వేసవిలో కూరగాయల సాగుకు ఫిబ్రవరి నెల చాలా అనుకూలమైనదని ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు బీర, కాకర, సొరకాయ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ, పాలకూర, కొత్తిమీర సాగు చేయడం ద్వారా మంచి దిగుబడులు వస్తాయని సూచించారు.
కూరగాయల సాగులో తేమ శాతం తగ్గకుండా తరచుగా నీరు అందించేందుకు వీలుగా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.