మా ఆదేశాలను 17లోగా అమలు చేయండి.. హైకోర్టు
హైకోర్టు ఉద్యోగిగా రిటైరై న నిర్మల అనే మహిళకు పెన్షన్, గ్రాట్యు టీ మంజూరు విషయమై 2021లో జారీచేసిన ఉత్తర్వులను నవంబర్ 17 లోగా అమలు చేయాలని అధికారుల కు హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): పెన్షన్ అర్హత సర్వీసు కంటే మూడు నెలల 13 రోజులు తకువ ఉన్నదన్న కారణంతో పెన్షన్, గ్రాట్యుటీ లెకింపునకు పరిగణనలోకి తీసుకోకపోవడంపై నిర్మల గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పెన్షన్ అర్హత పొందేందుకు అవసరమైన సర్వీసు కంటే పిటిషనర్ సర్వీ సు స్వల్పంగా తగ్గినందున నిబంధనలు సడలించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని పేరొన్నది.
నిర్మల విజ్ఞప్తిని పరిశీలించి, నిబంధనల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని గతంలోనే ప్ర భుత్వాన్ని ఆదేశించింది. అమలు కాకపోవడంతో నిర్మల కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టిం ది. వచ్చే నెల 17లోగా ఆదేశాలను అమలు చేయడంతోపాటు సంబంధిత వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులకు స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

