Marpally | వికారాబాద్ జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో రాళ్ల వాన.. ఎటు చూసినా వడగండ్ల కుప్పలే!
Marpally | వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగండ్ల వాన ( Hailstorm ) దంచికొట్టింది. ఈ భారీ వడగళ్ల వానకు ఆ ప్రాంతమంతా మంచు మయంగా మారింది. మర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి.
Marpally | వికారాబాద్ జిల్లా( Vikarabad Dist )లో కనీవినీ ఎరుగని రీతిలో వడగండ్ల వాన( Hailstorm ) కురిసింది. ఎటు చూసినా వండగండ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పంట పొలాల్లో వడగండ్లు నిండిపోవడంతో మంచు తుఫాను వచ్చిందా అన్నట్లుగా కనిపిస్తోంది. రోడ్డుపై కూడా భారీగా వడగండ్లు ఉండిపోవడంతో.. ఆ రహదారులపై ప్రయాణిస్తున్న వారు ఓ కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఎండిపోయిన చెట్ల మధ్య నిండిపోయిన వడగండ్లతో ఆ ఏరియాకే కొత్త అందం వచ్చింది అనుకుంటున్నారు. భారీగా పేరుకుపోయిన వడగండ్లను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగండ్ల వాన దంచికొట్టింది. ఈ భారీ వడగళ్ల వానకు ఆ ప్రాంతమంతా మంచు మయంగా మారింది. మర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. భారీ వడగండ్ల వానకు కార్లు కూడా దెబ్బతిన్నాయి. కార్ల అద్దాలు పగిలిపోయాయి. భారీ సమూహాలుగా ఏర్పడిన వడగండ్లతో స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పంటల విషయానికి వస్తే వడగండ్ల ధాటికి మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

భారీ వడగండ్ల వానకు మంచు మయంగా మారిన వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం.. pic.twitter.com/oX9VS1LgMT
— Namasthe Telangana (@ntdailyonline) March 16, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

