హైదరాబాద్, ఆగస్టు 27, (నమస్తే తెలంగాణ): వరంగల్‌లో ఆందోళన బాటపట్టిన పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ పాలనకు ఇది నిదర్శనమని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హరీశ్‌రావును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.