Telangana | మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి.. పెద్దమ్మ గుడి ముందు గురుకుల అభ్యర్థుల భిక్షాటన.. వీడియో
Telangana | నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డీఎస్సీతో పాటు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.
Telangana | హైదరాబాద్ : నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డీఎస్సీతో పాటు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల భర్తీల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు.
మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అంటూ పెద్దమ్మ గుడి ముందు గురుకుల అభ్యర్థులు భిక్షాటన చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన తెలపడానికి అనుమతించకపోవడంతో పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసుకునే వారితో కలిసి కూర్చొని అడుక్కుంటూ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద లేకపోవడంతో ఆయన ఢిల్లీలో ఉండటంతో ఆయన ఫ్లెక్సీకి వినతి పత్రం అందించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు మోకాళ్ళ మీద కూర్చొని కొంగు పట్టి చాచి అడుక్కున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అంటూ పెద్దమ్మ గుడి ముందు బిక్షాటన చేస్తున్న గురుకుల అభ్యర్థులు
రేవంత్ రెడ్డి ముందు ఆందోళన తెలపడానికి అనుమతించకపోవడంతో పెద్దమ్మ గుడి ముందు బిక్షాటన చేసుకునే వారితో కలిసి కూర్చొని అడుక్కుంటూ నిరసన తెలిసిన గురుకుల అభ్యర్థులు. https://t.co/P45R20Mu5C pic.twitter.com/zNNLxuFLsG
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

