Guideline | ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకంపై వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు..!
Guideline | ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశాల మేరకు డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలకు వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
Guideline | ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశాల మేరకు డీఎంఈ పరిధిలోని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలకు వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఆరోగ్య తెలంగాణ సాకారం చేసేందుకు కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు ఈ సందర్బంగా ఆకాంక్షించారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోట కనీసం రెండేళ్ల సర్వీస్ పూర్తయిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను మాత్రమే బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు. ఒకవేళ బదిలీ కోసం పెట్టుకున్న దరఖాస్తులు 17 కాలేజీల్లోని ఖాళీల కన్నా ఎక్కువగా ఉంటే.. నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ రిమ్స్ లో ఖాళీల్లో భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ సందర్భంగా ఉస్మానియా, గాంధీ, కాకతీయ (వరంగల్), నిజామాబాద్ మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రదర్శించరు. ఒక పోస్ట్ కు ఒకరికన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే స్పౌజ్, అంగవైకల్యం, బుద్ధిమాంద్యం పిల్లలు, కారుణ్య నియామకాలు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు వంటి అంశాల ఆధారంగా ప్రాధాన్యం నిర్ణయిస్తారని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

