Group-1 Prelims | నేటి నుంచి గ్రూప్-1 హాల్‌టికెట్లు.. పాతవి చెల్లవు.. మళ్లీ ఫ్రెష్‌గా డౌన్లోడ్ చేయాల్సిందే !
Group-1 Prelims | గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను ఆదివారం నుంచి https://www. tspsc.gov. in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
Group-1 Prelims | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను ఆదివారం నుంచి https://www. tspsc.gov. in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ ( TSPSC ) సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. గతంలో రద్దయిన పరీక్ష హాల్‌టికెట్లు చెల్లవని స్పష్టం చేశారు. వెబ్సైట్లో నమూనా ఓఎంఆర్ షీట్ అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు.
పరీక్షకు మరో వారం గడు వు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై టీఎస్పీఎస్సీ ము మ్మర కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతోపాటు ఎగ్జామ్ సూపరింటెండెంట్లతో కమిషన్ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాల్లో ట్రాఫి క్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతఅక్టోబర్ 16న ప్రిలిమినరీ నిర్వహించగా, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తో కమిషన్ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పకటించింది. కాగా, 503 గ్రూప్1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయి.
పరీక్షాకేంద్రాల ర్యాండమైజేషన్
గత అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 1,040 సెంటర్లలో నిర్వహించారు. ఈ సారి ఆ సెంటర్లలోని అభ్యర్థులను ర్యాండమైజేషన్ చేయాలని భావిస్తున్నది. గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో కొన్నింటిని మార్చాలని యోచిస్తున్నది. పరీక్ష కేం ద్రంలోకి అభ్యర్థులను అనుమతించే విషయంలో పకడ్బందీగా ఉండాలని నిర్ణయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

