Graduate MLC Bypoll | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ.. ఆధిక్యంలో మల్లన్న
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం (Graduate MLC Bypoll) ఉత్కంఠ రేపుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితం ఇంకా తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం (Graduate MLC Bypoll) ఉత్కంఠ రేపుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితం ఇంకా తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు 1,23,210 ఓట్లు వచ్చాయి. విజయం సాధించాలంటే మరో 32 వేల ఓట్లు అవసరమున్నది. ఇక రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,514 ఓట్లు వచ్చాయి. బీజేపీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 43,486, స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్‌కు 29,776 ఓట్లు పోలయ్యాయి.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 33 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. 33 మంది అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అయ్యాయి. కాగా, బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాతే ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. మ్యాజిక్ ఫిగర్‌కు 1,55,095 ఓట్లు రావాల్సి ఉన్నది. శుక్రవారం సాయంత్రం తర్వాత తుది ఫలితం రానుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Counting
- Elimination
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

