Sammakka barrage | సమ్మక్క బరాజ్ వద్ద పెరుగుతున్న గోదావరి
Sammakka barrage | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ (Sammakka barrage) వద్ద గోదావరి(Godavari river) నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది(Godavari rising).
కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ (Sammakka barrage) వద్ద గోదావరి(Godavari river) నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది(Godavari rising). బుధవారం ఎగువ నుంచి 86,630 క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటిమట్టం 74.50 మీటర్ల ఎత్తుకు చేరుకున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. బరాజ్‌లోని 52 గేట్లను ఎత్తి 86,047 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, ఎగువన ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని ఫేస్ 3లో ఉన్న రెండు మోటర్లతో రోజుకు 583 క్యూసెక్కుల నీటిని భీం ఘనపురం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తున్నట్లు డీఈ శరత్, ఏఈఈ సాయిరాం తెలిపారు.
మరోవైపు మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌కు (Medigadda barrage) భారీగా వరద(Heavy flood) వస్తున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ద్వారా బుధవారం 49,500 క్యూసెక్కుల వరద రాగా, బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విదులుతున్నారు. ప్రవాహ తీవ్రతను భారీ నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రవాహ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

