పాలిటెక్నిక్‌తో పాలిటిక్స్ వద్దు.. జీవో- 97ని వెంటనే రద్దు చేయాలి
పాలిటెక్నిక్ విద్యతో పాలిటిక్స్ ఆడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు జారీ చేసిన జీవో -97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల డిమాండ్
- కరీంనగర్లో విద్యార్థినులతో కలిసి నిరసన
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఆగస్టు 23 : పాలిటెక్నిక్ విద్యతో పాలిటిక్స్ ఆడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు జారీ చేసిన జీవో -97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. జీవో- 97 వల్ల తాము ఎదురొంటున్న సమస్యలను విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విద్యార్థినులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. జీవో-97తో పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. పాలిటెక్నిక్‌ను పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యలో అనేక అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు గ్రాడ్యుయేషన్‌కు అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

