హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అంగస్తంభన సమస్యలను నయంచేసే పుల్మోసిల్ ఇంజెక్షన్లలో నకిలీ వెర్షన్ అమ్మకాలు జరుగుతున్నట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు కనుగొన్నారు. హైదరాబాద్ శివారు తుర్కపల్లిలోని సన్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఈ నకిలీ వెర్షన్ తయారైనట్టు గుర్తించారు. బ్యాచ్ నంబర్ కేఎఫ్ఏ 0300, మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ 06/23తో ఉన్న 10 ఎంజీ/12.5 ఎంఎల్ పుల్మోసిల్ ఇంజెక్షన్లలో ఫంగస్ ఉన్నట్టు తేలడంతో.. వాటి అమ్మకాలను నిలిపివేయాలని విక్రేతలకు నోటీసులు జారీ చేశారు.