హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటించినందున మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్ తెలిపారు. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(టీఎమ్ఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో గ్రూప్స్, పోలీస్, టెట్ తదితర పరీక్షల కోసం ఉచిత కోచింగ్ ఇస్తామని వివరించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.