CM Revanth | ఫాక్స్‌కాన్ భవిష్యత్ ప్రాజెక్టులకు సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth | ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొంగరకలాన్ ఉత్పాదక కేంద్రానికి కూడా సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
CM Revanth | హైదరాబాద్ : ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొంగరకలాన్ ఉత్పాదక కేంద్రానికి కూడా సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్‌కు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం కలిశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్దిని మరింత వేగవంతం చేస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలిపారు.
2023, డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్సాకాన్ గ్రూప్ ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ ప్రధానంగా ఆపిల్ ఐఫోన్లను తయారు చేస్తుంది. ఫాక్స్‌కాన్ ప్రధాన కస్టమర్లలో గూగుల్, జియోమి, అమెజాన్, అలీబాబా గ్రూప్, సీస్కో, డెల్, ఫేస్బుక్, సోని, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి సంస్థలు ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా 1,00,000 ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25000 ఉద్యోగాలు కల్పించనున్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సీఎం శ్రీ @Revanth_Anumula స్పష్టం చేశారు. @HonHai_Foxconn కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి శ్రీ వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో… pic.twitter.com/U1bJz4TagT
— Telangana CMO (@TelanganaCMO) December 26, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

