Bagless Day | బ్యాగ్‌లెస్ డే.. ఆటపాటల సందడే!
భుజాన బడి సంచిలేదు. పుస్తకాలు లేనే లేవు. నోట్ పుస్తకాలు, హోంవర్క్ హడావుడి అసలే లేదు. చెట్టాపట్టాలేసుకొని చిన్నారులు వచ్చారు. ఆటపాటలతో సందడి చేశారు.. ఇదీ శనివారం బ్యాగ్‌లెస్ డేలో భాగంగా పాఠశాలల్లో కనిపించిన వాతావరణం. ఈ విద్యా సంవత్సరం నుంచి నెలలో నాలుగో శనివారం బడుల్లో బ్యాగ్‌లెస్ డేను పాటించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ శనివారం పాటించారు.
Bagless Day | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): భుజాన బడి సంచిలేదు. పుస్తకాలు లేనే లేవు. నోట్ పుస్తకాలు, హోంవర్క్ హడావుడి అసలే లేదు. చెట్టాపట్టాలేసుకొని చిన్నారులు వచ్చారు. ఆటపాటలతో సందడి చేశారు.. ఇదీ శనివారం బ్యాగ్‌లెస్ డేలో భాగంగా పాఠశాలల్లో కనిపించిన వాతావరణం. ఈ విద్యా సంవత్సరం నుంచి నెలలో నాలుగో శనివారం బడుల్లో బ్యాగ్‌లెస్ డేను పాటించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ శనివారం పాటించారు.
విద్యార్థుల్లో అభిరుచి, ఆసక్తిని కలిగించే పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఏకాగత్రను పెంచుతూ ఉల్లాసపూరిత వాతావరణముండేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు. ఎస్సీఈఆర్టీ అధికారులు రూపొందించిన పుస్తకాన్ని అనుసరించి పలు కార్యక్రమాలు అమలు చేశారు. తొలిరోజున తమ పాఠశాలలో ఆటపాటలతోపాటు వారి కుటుంబం, సమాజంలోని వ్యవస్థల గురించి విద్యార్థుల మాటల్లోనే చెప్పించినట్టు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోట మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చందూరి రాజిరెడ్డి తెలిపారు. నీతికథల ద్వారా మాట్లాడే నైపుణ్యాలను పెంపొందించామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

