టీడీపీ, ఆరెస్సెస్,కాంగ్రెస్ సంకీర్ణ సర్కారిది!
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ కాదని.. టీడీపీ, ఆరెస్సెస్ కాంగ్రెస్ అని ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్లో చేరారు.
- రేవంత్‌కు ఉత్తమ్, భట్టి, దుద్దిళ్ల సరెండర్
- లీవ్ కాంగ్రెస్.. సేవ్ తెలంగాణ: భార్గవ్ దేశ్‌పాండే
- కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువనేత
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ) : ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ కాదని.. టీడీపీ, ఆరెస్సెస్ కాంగ్రెస్ అని ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. భార్గవ్‌కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భార్గవ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను 2006 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని, అయితే అప్పటి కాంగ్రెస్‌కు, ఇప్పటి కాంగ్రెస్‌కు ఎంతో తేడా ఉన్నదని వ్యాఖ్యానించారు.
రేవంత్‌కు సరెండర్
మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార, శ్రీధర్‌బాబు పూర్తిగా రేవంత్‌రెడ్డికి సరెండర్ అయ్యారని భార్గవ్ దేశ్‌పాండే విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ చెప్పే మాటలకు, తెలంగాణలో కొనసాగుతున్న పాలనకు పూర్తి విరుద్ధంగా ఉన్నదని మండిపడ్డారు. ‘ఇది అసలు కాంగ్రెస్ కాదు.. తెలుగుదేశం, ఆరెస్సెస్ భావజాలంతో నడుస్తున్న కాంగ్రెస్.. లీవ్ కాంగ్రెస్.. సేవ్ తెలంగాణ’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

