మక్కలు కొనకపోతే ఉద్యమిస్తాం.. రైతులకు గన్నీ సంచులు ఇయ్యకుంటే ఊరుకోం
మక్కలను వెంటనే కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గన్నీ సంచులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరిక
- నర్సింహులపేటలోని కొనుగోలు కేంద్రం సందర్శన
నర్సింహులపేట, మే 1 : మక్కలను వెంటనే కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గన్నీ సంచులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లంచం ఇచ్చిన వారివి మాత్రమే కాంటా పెడుతున్నారని, కొనుగోలు కేంద్రం వైపు ఎవరూ రావడం లేదని, గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో కాంటా ఆలస్యమవుతుందని ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన సత్యవతిరాథోడ్ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 50 వేల గన్నీ బస్తాలు అవసరం ఉంటే కేవలం 15 వేల బస్తాలు ఇచ్చి మిగతావి రైతులనే తెచ్చుకోవాలని చెప్పి చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. ఒక్కో బస్తాను రూ.25 నుంచి రూ.30 వరకు రైతులు కొంటున్నారని, దీంతో బస్తాకు రూ.15 నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్‌తో మాట్లాడి రైతులకు గన్నీ సంచులు ఇచ్చేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. కొనుగోలులో జాప్యంతో వర్షం వస్తే పంట మొత్తం నీటిపాలవుతుందని, దీనికి ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ సర్కార్‌కు వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

