Grain purchases | కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ..రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న అన్నదాతలు
కడుపు మండిన మక్క రైతులు కన్నెర్ర చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం ఆందోళనకు దిగారు. గంగాపూర్ సమీపంలోని జడ్చర్ల-కల్వకుర్తి హైవేపై పత్తి మార్కెట్ వద్ద 3 గంటలపాటు బైఠాయించారు. ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలను కాంటా వేసిన అధికారులు ఎత్తకపోవడంతో 40 వేల బస్తాలు మార్కెట్లోనే ఉండిపోయాయని వాపోయారు.
- బస్తాకు రూ.2 ఇస్తేనే లారీ అన్లోడ్
- రైతుల నుంచి వేలల్లో అదనపు వసూళ్లు
- క్వింటాల్‌కు ఏడున్నర కిలోల ధాన్యం కోత పెడ్తున్న వైనం
- పట్టని మిల్లర్ల దోపిడీ.. 20 రోజులైనా కాంటాకెక్కని వడ్లు
- కొనుగోళ్లు లేక.. వర్షాలకు కల్లాల్లో మొలకెత్తుతున్న ధాన్యం
- మిల్లర్లకు మేలుచేసేలా అధికారుల తీరు.. పైగా కొర్రీలు
- రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న అన్నదాతలు
జడ్చర్ల, మే 9 : కడుపు మండిన మక్క రైతులు కన్నెర్ర చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం ఆందోళనకు దిగారు. గంగాపూర్ సమీపంలోని జడ్చర్ల-కల్వకుర్తి హైవేపై పత్తి మార్కెట్ వద్ద 3 గంటలపాటు బైఠాయించారు. ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలను కాంటా వేసిన అధికారులు ఎత్తకపోవడంతో 40 వేల బస్తాలు మార్కెట్లోనే ఉండిపోయాయని వాపోయారు.
బ్యాగుల కొరతతోపాటు గోదాముల్లో స్థలం లేక మార్కెట్లోనే ఉంచిన మక్కజొన్న బస్తాల వద్ద నిత్యం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మార్క్‌ఫెడ్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు రైతులకు నచ్చజెప్పే యత్నం చేసినా విన్పించుకోలేదు. కలెక్టర్, ఎమ్మెల్యే రావాలని పట్టుబట్టారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రైతులకు మద్దతుగా బైఠాయించారు. మార్క్‌ఫెడ్, పీఏసీఎస్ అధికారులు, తహసీల్దార్‌తో మాట్లాడారు. ఐదురోజుల కిందట మార్కెట్‌కు వచ్చిన మక్కలను కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎట్టకేలకు అధికారులు దిగిరావడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

