Amazon | 3.2 కోట్లు ‘సెటిల్’ చేశాడు!.. అమెజాన్ మాజీ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్ చేతివాటం
సంస్థలో నుంచి వెళ్లిన మాజీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రూ. 3.2 కోట్లు సెటిల్మెంట్ పేరుతో పక్కదారి పట్టించిన అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాజీ ఫైనాన్సియల్ ఆపరేషనల్ అనలసిస్ట్ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అరెస్ట్ చేసింది.
Amazon | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): సంస్థలో నుంచి వెళ్లిన మాజీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రూ. 3.2 కోట్లు సెటిల్మెంట్ పేరుతో పక్కదారి పట్టించిన అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాజీ ఫైనాన్సియల్ ఆపరేషనల్ అనలసిస్ట్ను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అరెస్ట్ చేసింది. ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌కు చెందిన మెట్టు వెంకటేశ్వర్లు అమెజాన్‌లో 2015 జూలైలో ఫైనాన్సియల్ ఆపరేషన్ అనలసిస్ట్గా చేరాడు. ఉద్యోగుల జీతభత్యాల వ్యవహారాలన్నీ సెటిల్ చేసేవాడు.
సంస్థ లో మానేసిన ఉద్యోగులు, యాక్టివ్‌గా లేని ఉద్యోగుల పెండింగ్ సెటిల్మెంట్ల ఫైల్స్ బయటకు తీశాడు. కొందరు మాజీ ఉద్యోగులతో చేతులు కలిపి, వాళ్లు తమ బకాయిలు సెటిల్ చేయమన్నట్టుగా నకిలీ మెయిల్స్ చేసేవాడు. పాత ఉద్యోగి బ్యాంకు ఖాతా మారినట్టు, కొత్త ఖాతాలోకి బకాయిలు డిపాజిట్ చేయాలని మెయిల్స్ పంపించేవాడు. మెయిల్ రిక్వెస్ట్‌ను అప్రూవల్ చేసి ఆయా ఖాతాల్లో డిపాజిట్లు చేయించాడు. ఇలా 184 మంది ఉద్యోగుల బకాయిలు 50 ఖాతాల్లోకి బదిలీ చేయించాడు. ఆ ఖాతాలన్నీ తన స్నేహితులు, బంధువులవే కావడం గమనార్హం. ఇలా 2016 నుంచి 2023 వరకు రూ.3.2 కోట్లు పక్కదారి పట్టించాడు. కంపెనీ అంతర్గత అడిట్‌లో ఈ విషయం వెలుగులోకి రావడంతో వెంకటేశ్వర్రావు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆడిటింగ్‌లో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంస్థ లా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రతినిధి అంకుర్‌శర్మ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ హుస్సేనీనాయుడు నేతృత్వంలోని బృందం కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

