ఎఫ్ఎంజీలపై సర్కార్ ఉక్కుపాదం!
స్టైపెండ్ పెంచాలని ఆందోళన చేస్తున్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ)పై సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వారి ఇంటర్న్‌షిప్ రద్దు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
- ఇంటర్న్‌షిప్ రద్దు దిశగా అడుగులు?
- వైద్య శాఖ నివేదికపై అంటూ కథనాలు
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : స్టైపెండ్ పెంచాలని ఆందోళన చేస్తున్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ)పై సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వారి ఇంటర్న్‌షిప్ రద్దు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, బోధన దవాఖానల్లో ఇంటర్న్‌లుగా పనిచేస్తున్న దాదాపు 1100 మంది తమ ైస్టెపెండ్ పెంచాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరిలో 700 మంది ప్రభుత్వ దవాఖానల్లో, 400 మంది ప్రైవేట్ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్న్‌లుగా పనిచేస్తున్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఐఎంజీ)లకు ప్రతినెల రూ.29,792 స్టైపెండ్ చెల్లిస్తుండగా.. తమకు మాత్రం కేవలం రూ.5 వేలు చెల్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తమకు సైతం ఐఎంజీల మాదిరిగానే స్టైపెండ్ చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఎఫ్‌ఎంజీల ఆందోళనలను బేఖాతరు చేస్తున్న ప్రభుత్వం వారి ఇంటర్న్‌షిప్‌ను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు బోధన దవాఖానల్లో ఎఫ్‌ఎంజీల ఇంటర్న్‌షిప్ రద్దు చేయాలని ప్రభుత్వానికి వైద్యశాఖ నివేదిక అందించినట్టు పలు కథనాలు వెలువడ్డాయి. ఐఎంజీల మాదిరిగానే ఎఫ్ఎంజీలకు కూడా సమాన స్టైపెండ్ తోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

