Fire Accident | ఎల్బీనగర్లో అగ్ని ప్రమాదం.. 50 కార్లు దగ్ధం.. !
Fire Accident | హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో గల ఒక టింబర్ డిపోలో చెలరేగిన మంటలు కార్ల గ్యారేజీని తాకాయి. 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్లు, అగ్నిమాపకదళ సిబ్బంది కృషి చేస్తున్నారు.
Fire Accident | తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారుల్లోని ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎల్బీ నగర్ సద్గురు కాలనీలోని కారు ఓ మ్యాన్ సర్వీసింగ్ సెంటర్లో షార్ట్ షర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.దాని పక్కనే ఉన్న టింబర్ డిపోకు మంటలు వ్యాపించాయి.

‘కారు ఓమెన్ కారు షోరూమ్’ అనే ఈ పాత కార్ల గ్యారేజీలో సిలిండర్లు ఉండటంతో భారీగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఆ కార్ల గ్యారేజీలో 50కి పైగా కార్లు పూర్తిగా బూడిదయ్యాయి. మంటలకు టైర్లు, కార్ల పెట్రోల్ ట్యాంకులు పేలడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. గ్యారేజీలో సిలిండర్లు కూడా ఉండటంతో పేలుళ్లు సంభవిస్తున్నట్లు తెలుస్తున్నది.

మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకున్నది. దీంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అప్రమత్తమైన పోలీసు, పౌర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా, టింబర్ డిపో చుట్టుపక్కల వారిని ఇండ్ల నుంచి తరలిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

