ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
మహబూబాబాద్ జిల్లా లింగ్యాతండాలో ఘటన.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణం
కురవి, అక్టోబర్ 10: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల శివారు లింగ్యా తండాలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగ్యా తండాకు చెందిన బానోత్ నవీన్‌తో ఇదే తండాకు చెందిన అనూష (31)కు 12 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రుత్విక కురవి ఆశ్రమ పాఠశాలలో ఐదోతరగతి, రెండో కుమార్తె వర్షిణి (9) ఇదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. కుమారుడు వృషాంక్ కృష్ణ (4) అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. అనూష తన భర్త నవీన్‌తోపాటు పిల్లలతో కలిసి తల్లిగారింటి వద్దనే ఉంటుంది.
అనూష టైలరింగ్‌తోపాటు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నది. నవీన్ ఆటో నడుపుతున్నాడు. గత వారం అనూష తల్లి సుశీల.. తన ఆలనపాలనా ఎవరూ చూడటంలేదని పెద్దమనుషులకు చెప్పడంతో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. దీంతో అనూష, నవీన్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆటో ఫైనాన్స్ విషయమై ఇరువురి మధ్య వివాదం జరిగినట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం అనూష తన ఇంటి నుంచి ముగ్గురు పిల్లలను తీసుకుని ఊరికి సమీపంలో పొలాల వద్దకు వెళ్లింది.
గమనించిన చుట్టుపక్కల వారు అనూషకు సోదరుడైన చిన్నికి విషయం చెప్పారు. అతడు అనూషతోపాటు పిల్లలను అడ్డుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయినా వినకపోవడంతో రుత్వికను తీసుకుని ఇంటికెళ్లగా అనూష తన చిన్న కుమార్తె వర్షిణి, కుమారుడు వృషాంక్ కృష్ణతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

