సాగునీళ్లివ్వండి కలెక్టర్ సారూ..
సదర్మాట్ ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు వరకు నిరంతరాయంగా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- నిర్మల్ కలెక్టర్‌ను అడ్డుకున్న రైతులు
- కడెం మండలంలో వరితో నిరసన
- సదర్మాట్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సాగునీరందించాలని డిమాండ్
కడెం, అక్టోబర్ 24: నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట వద్ద రైతులు కలెక్టర్ భవేశ్మిశ్రాను అడ్డుకున్నారు. సదర్మాట్ ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు వరకు నిరంతరాయంగా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కడెం మండలం పాతమద్దిపడగ, కొత్త మద్దిపడగ, లక్ష్మీసాగర్, చిట్యాల గ్రామాలకు చెందిన 40 మందికిపైగా రైతులు శనివారం ధర్మాజీపేట సమీపంలోని ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు.
ఆందోళనకు సిద్ధమవుతుండగా అదే మార్గం గుండా కొండుకూర్ గ్రామానికి కలెక్టర్ భవేశ్‌మిశ్రా వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు కలెక్టర్‌ను అడ్డుకున్నారు. పోలీసులు సముదాయించడంతో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఎండుతున్న పంటలను ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్ పరిశీలించి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారం రోజుల్లో సమస్యను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

