కరువులోనూ ఆదుకున్న సన్నాలు
వర్షాభావ పరిస్థ్దితులు ఈసారి అన్నదాతకు పెద్దగా కలిసి రాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు రకం, మరికొన్ని ప్రాంతాల్లో సన్న రకం ధాన్యం రైతులను గట్టెక్కించాయి. ప్రధానంగా సన్నాల్లో జీనెక్స్ చిట్టిపొట్టి రకం విత్తనాలు సాగు చేసిన రైతులకు మంచి లాభం దక్కినట్లు రైతులు, మిల్లర్లు చెప్తున్నారు.
- జీనెక్స్ చిట్టి పొట్టి రకం ఎకరాకు 45-50 బస్తాలు దిగుబడి వచ్చిదంటున్న రైతులు
- సన్నాలకే బోనస్ అన్న ప్రభుత్వం ప్రకటనతో చిట్టిపొట్టికి పెరిగిన డిమాండ్
నల్లగొండ, జూన్ 3 : వర్షాభావ పరిస్థ్దితులు ఈసారి అన్నదాతకు పెద్దగా కలిసి రాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు రకం, మరికొన్ని ప్రాంతాల్లో సన్న రకం ధాన్యం రైతులను గట్టెక్కించాయి. ప్రధానంగా సన్నాల్లో జీనెక్స్ చిట్టిపొట్టి రకం విత్తనాలు సాగు చేసిన రైతులకు మంచి లాభం దక్కినట్లు రైతులు, మిల్లర్లు చెప్తున్నారు. చిట్టిపొట్టి ఎక్కువగా ప్రతి సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు ప్రాంతాలైన నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజక వర్గాల్లో ఎక్కువ సాగవుతుండగా ఈసారి నాన్ ఆయకట్టు ప్రాంతాలైన నల్లగొండ, నకిరేకల్ ప్రాంతాల్లోనూ మంచి దిగుబడి సాధించింది.
120 రోజుల్లోనే దిగుబడి
120 రోజుల్లోనే చేతికొచ్చిన జీనెక్స్ చిట్టిపొట్టి రకం తక్కువ నీటితోనే ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి వచ్చిందని రైతులు చెప్తున్నారు. మార్కెట్లో క్వింటా రూ.2,600 నుంచి రూ.2,800 దాకా పలికిందని పేర్కొంటున్నారు. ఈ యాసంగి సీజన్లో నల్లగొండ జిల్లాలో 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అందులో 2.20 లక్షల ఎకరాలు సన్న ధాన్యమే ఉంది. ప్రధానంగా ఆధునీకరించిన మిల్లులు మన దగ్గర ఉండడంతోపాటు వచ్చిన పచ్చి ధాన్యాన్ని బాయిల్డ్ చేసి ఇతర రాష్ర్టాలు, దేశాలకు మార్కెటింగ్ చేస్తుండడంతో సన్నాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో చిట్టిపొట్టి వంటి వెరైటీలు మంచి నాణ్యంగా రావడంతో క్వింటాకు రూ.2,700 నుంచి రూ.2,800 వరకూ పెట్టి కొనుగోలు చేసినట్లు మిర్యాలగూడకు చెందిన మిల్లర్ వెంకటరమణ తెలిపారు. ఈసారి సాగు నీరు తక్కువగా ఉన్నప్పటికీ సన్న ధాన్యం సకాలంలో చేతికి రావడంతో రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయని నల్లగొండ డీఏఓ శ్రవణ్ కుమార్ తెలిపారు.చిట్టి పొట్టి ఎకరాకు 50 బస్తాల దాకా దిగుబడి వచ్చిందని, మిల్ల ర్లు క్వింటాకు రూ.2,600 నుంచి రూ.2,800 పెట్టి కొనుగోలు చేశారని చెప్పారు.
మంచి లాభం వచ్చింది
నేను నాలుగేండ్లు గా జీనెక్స్ చిట్టిపొట్టి రకం వరి సాగు చేస్తు న్నా. ఈ సారి మూ డెకర్లాలో వేస్తే ఎకరానికి 44 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. వడ్లు మంచిగా ఉండడం, పచ్చి వడ్లకే క్వింటాకు రూ.2,700 పెట్టడం వల్ల మంచి లాభం దొరికింది. ఈసారి కూడా చిట్టిపొట్టి రకమే వేస్తాను. దీనికి నీటి అవసరం తక్కువగా ఉండటం, చీడపీడ లేకపోవడంతో పెట్టుబడి కూడా ఎక్కువగా రాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

