మిల్లర్ల దగాపై రైతన్న ఆగ్రహం
రైస్ మిల్లుల నిర్వాహకులు సిండికేట్‌గా మారి ధాన్యం ధరలు తగ్గించి అన్యాయం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ శివారులోని ఎక్స్‌రోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండు రోజుల కిందటి వరకు సన్నరకం ధాన్యానికి రూ.3,150, దొడ్డు రకానికి రూ.2,250 ధర పెట్టిన రైస్ మిల్లుల యజమానులు గురువారం సన్న రకానికి రూ.2,700, దొడ్డు రకానికి రూ.2 వేలు ఇస్తామనడం సరికాదని అన్నారు.
- సిరిసిల్ల జిల్లా నామాపూర్‌లో రాస్తారోకో
ముస్తాబాద్, అక్టోబర్ 22 : రైస్ మిల్లుల నిర్వాహకులు సిండికేట్‌గా మారి ధాన్యం ధరలు తగ్గించి అన్యాయం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ శివారులోని ఎక్స్‌రోడ్డు వద్ద పెద్ద సంఖ్యలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండు రోజుల కిందటి వరకు సన్నరకం ధాన్యానికి రూ.3,150, దొడ్డు రకానికి రూ.2,250 ధర పెట్టిన రైస్ మిల్లుల యజమానులు గురువారం సన్న రకానికి రూ.2,700, దొడ్డు రకానికి రూ.2 వేలు ఇస్తామనడం సరికాదని అన్నారు.
మొదట మండలంలోని రైతుల ధాన్యం కొన్న తరువాతే సరిహద్దులో ఉన్న ఇతర జిల్లాల దిగుబడులు కొనాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై మూడు గంటలపాటు ఆందోళన చేపట్టడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై జ్యోతి, డిప్యూటీ తహసీల్దార్లు రజిత, సత్యనారాయణ, అధికారులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేశారు. మిల్లర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

