పంట పొలాల్లో బుల్డోజర్లు
ఫ్యూచర్ సిటీలో భాగమైన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు రైతు ల పంట పొలాల్లో బుల్డోజర్లను దింపుతున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు వరకు 41 కిలోమీటర్ల పొడవు, 330 ఫీట్ల వెడల్పు తో పనులు జరుగుతున్నాయి.
- గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం పంటలు ధ్వంసం
- అధికారుల తీరుపై రైతుల విస్మయం
రంగారెడ్డి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్ సిటీలో భాగమైన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు రైతు ల పంట పొలాల్లో బుల్డోజర్లను దింపుతున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు వరకు 41 కిలోమీటర్ల పొడవు, 330 ఫీట్ల వెడల్పు తో పనులు జరుగుతున్నాయి. మొదటి దశలో మీర్ఖాన్పేట్ వరకు పనులు చే పట్టారు. ఇప్పటికే రైతుల పంటపొలా లు, పౌల్ట్రీ, డెయిరీ ఫారాలను అధికారు లు నేలమట్టం చేశారు.
రెండో విడుతలో మీర్ఖాన్పేట్ నుంచి ఆకుతోటపల్లి వరకు చేస్తున్న పనుల్లో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లిలో బుల్డోజర్లతో పొలాలను ధ్వంసం చేశారు. 15రోజుల్లో పంట చేతికొస్తుందని కోరినా పట్టించుకోలేదు. తమకు అను కూలంగా ఉండే ఒకరిద్దరు పొలాలకు నామమాత్రం పరిహారం చెక్కులు ఇచ్చారు. ముందుగా వారి పొలాల్లో బుల్డోజర్లు పెట్టి భయాందోళనలు సృష్టిస్తున్నారు. దీంతో మిగతా రైతులు కూడా తమ పొలాలను ఇచ్చేలా అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నట్టు రైతులు వాపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

