పంటలకు మురుగు నీరే దిక్కు
జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా పంటలకు నీరందని పరిస్థితి ఇక్కడి రైతులది. కాలువలకు నీటి సరఫరా లేకపోవడం..
- కాలువలకు నీరు రాక.. కరెంట్ సరఫరా లేక తిప్పలు
- అయిజ పెద్దవాగు నుంచి నిత్యం 20 ట్యాంకర్లతో మురుగు నీరు పొలాలకు తరలింపు
అయిజ, అక్టోబర్ 30 : జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా పంటలకు నీరందని పరిస్థితి ఇక్కడి రైతులది. కాలువలకు నీటి సరఫరా లేకపోవడం.. భూగర్భ జలాలు అడుగంటడం.. కరెంట్ కోతలతో నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రూ.వేలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలను ఎలాగైనా కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నారు. అయిజ మండలం తుపత్రాల రైతులు అధికంగా మిరప సాగు చేశారు.
అయితే పెద్దవాగులో పారుతున్న మురుగు నీటిని ట్యాంకర్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. నిత్యం 20 ట్యాంకర్లను ఏర్పాటు చేసుకొని మిరప పైరును బతికించుకుంటున్నారు. నెలకు ఒక్కో ట్యాంకర్‌కు రూ.35 వేలు అద్దె, రోజుకు రూ.2 వేల డీజిల్, డ్రైవర్‌కు వెయ్యి, డీజిల్ ఇంజిన్‌కు రూ.200 భరిస్తూ పంటకు నీటి తడులు అందిస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.60 వేలకుపైగా పెట్టుబడులు పెట్టామని, ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుంటే చూడలేక మురుగునీరు పారిస్తున్నట్టు పలువురు రైతులు చెప్తున్నారు. నీటిని తరలించేందుకు ఖర్చు తడిసి మోపెడవుతున్నదని వాపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

