మక్కజొన్న సొప్ప కాలుస్తూ..ఊపిరాడక రైతు మృతి
మక్కజొన్న సొప్ప కాలుస్తుండగా పొగతో ఊపిరాడక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లికి చెందిన గాయపు భగవాన్‌రెడ్డి (55) అనే రైతు తన మక్కజొన్న చేనులో శనివారం సాయంత్రం సొప్పకు నిప్పంటించాడు.
- వరంగల్ జిల్లా కాట్రపల్లిలో విషాదం
సంగెం, మే 25 : మక్కజొన్న సొప్ప కాలుస్తుండగా పొగతో ఊపిరాడక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లికి చెందిన గాయపు భగవాన్‌రెడ్డి (55) అనే రైతు తన మక్కజొన్న చేనులో శనివారం సాయంత్రం సొప్పకు నిప్పంటించాడు. అతడి చేను పూర్తిగా కాలి పక్కన ఉన్న రైతు భాస్కర్‌రెడ్డి వేసిన ఆయిల్‌పామ్ తోటలోని అంతర్గత పంటగా మక్కజొన్న చేనులోకి మంటలు వ్యాపించాయి. అందులో ఆయిల్‌పామ్ పంటతోపాటు డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోతాయనే భయంతో భగవాన్‌రెడ్డి మంటలను ఆర్పేందుకు ఆ చేనులోకి వెళ్లాడు. అప్పటికే చేను అంటుకోవడంతోపాటు విపరీతమైన పొగ రావడంతో ఊపిరి ఆడక భగవాన్‌రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. భగవాన్రెడ్డికి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

