Siddipet | కాంగ్రెస్ నేత భూదాహం.. రైతు ఆత్మహత్యాయత్నం
భూమి తగాదా విషయ మై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక ఓ పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెం టనే ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ద వాఖానకు తరలించారు.
- భూమి విషయంలో కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యకాండ
- మితిమీరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అరాచకం
- రైతు పొలానికి దారి ఇచ్చేందుకూ 20 లక్షలు డిమాండ్!
- వేధింపులు తాళలేక పురుగులమందు తాగిన కిష్టయ్య
- గాంధీ దవాఖానకు తరలింపు.. రైతు పరిస్థితి విషమం
- భూమిని గుంజుకోవాలని చూస్తున్నారు: భార్య కనకవ్వ
- ప్రభుత్వం తమదేనంటూ వేధిస్తున్నారని ఆరోపణ
Siddipet | సిద్దిపేట ప్రతినిధి/కొండపాక, జూలై 11 (నమస్తే తెలంగాణ): భూమి తగాదా విషయ మై కాంగ్రెస్ నాయకుడి వేధింపులు తాళలేక ఓ పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెం టనే ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ద వాఖానకు తరలించారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం దమ్మకపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బండి పెద్దోళ్ల కిష్ట య్య సర్వేనంబర్ 1039లో ఉన్న 2.13 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అందులో కొంత భూమిని మరొకరికి అమ్ముకున్నాడు.
భూమిని కొనుగోలు చే సిన వారికి, తనకు ఉపయోగపడేలా కొంతభూమిని దారి కోసం వదిలి వాడుకుంటున్నా డు. అదే గ్రామానికి చెందిన ఆగంరెడ్డి చాలా కాలం క్రితం సర్వేనంబర్ 1038లో తన పే రుతో ఉన్న భూమిని మరొకరికి అమ్ముకున్నా డు. అందులో తనకు మరింత భూమి రావాలని బండి పెద్దోళ్ల్ల కిష్టయ్య, అతని కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, గజ్వేల్ మాజీ ఎమ్మె ల్యే, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూం కుంట నర్సారెడ్డికి దగ్గర వ్యక్తిగా పేరు పొందా డు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చిందని, త నను ఏమీ చేయలేరంటూ నర్సారెడ్డ్డి ద్వారా బెదిరించాడని కిష్టయ్య భార్య కనకవ్వ ఆరోపించింది.
20 రోజులుగా ఈ వేధింపులను భరించలేక తన భూమిని కొలిచి చూపించాలని ప్రభుత్వ సర్వేయర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. మొదటి రోజు ఎవరికీ లొంగకుండా కిష్టయ్య భూమిని కొలిచిన ప్రభుత్వ సర్వేయర్.. రెండోరోజు భయానికి గురై కిష్టయ్య కు సంబంధించిన భూమి ఆగంరెడ్డికి చెందుతుందని రిపోర్టును తయారుచేశాడు. పంచనామా కాపీని దరఖాస్తుదారుడు కిష్టయ్యకు కాకుండా ఆగంరెడ్డికి అందజేసి వెళ్లాడు.
ఈ తప్పుడు రిపోర్టు వల్ల తమ భూమిలోకి వెళ్లేందుకు కిష్టయ్య తీసిన దారి మొత్తం ఆగంరెడ్డి కే చెందుతుందని, తమకు తీవ్ర అన్యాయం చేశారని బాధిత రైతు వాపోతున్నాడు. ఇది అన్యాయమని రైతు కిష్టయ్య ఎంత వేడుకున్నా కనికరించని ఆగంరెడ్డి.. రూ.20 లక్ష లు ఇస్తేనే దారి వదులుతానని, కిష్టయ్య కు టుంబాన్ని గ్రామంలో ఉండనివ్వనని బెదిరించాడు. మనస్తాపం చెందిన కిష్టయ్య గురువారం సాయంత్రం తన పొలం వద్ద పురుగు ల మందు తాగాడు. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీకి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

