అంతర్జాతీయ స్థాయికి మంచినీటి చేపల ఎగుమతి
బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు దక్కింది.
- నేడు కోహెడలో నిర్మాణ పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు దక్కింది. ఈక్రమంలో దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో మంచినీటి చేపల అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం ఏర్పాటు అవుతున్నది.
దేశవ్యాప్తంగా మంచినీటి చేపల ఉత్పత్తిని పెంపొందించడంలో భాగంగా కేంద్రం చేపట్టిన ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద రాష్ర్టానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ పథకం కింద రూ.47 కోట్లతో 13 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 10న మంత్రి వాకిటి శ్రీహరి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
మంచినీటి చేపల ఉత్పత్తిని సాధించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. 2016-17లో 1,93,732 టన్నుల ఉత్పత్తితో రూ.2,111 కోట్లు, 2025లో రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల విలువైన 4.20 లక్షల టన్నుల చేపలు, రూ.1000 కోట్ల విలువైన 15 వేల టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఈ చేపల్లో 42 శాతం స్థానికంగా, 6 శాతం ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

