కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి
కాంగ్రెస్ సర్కా ర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా రాయపర్తిని కరువు మం డలంగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతోనే రాష్ట్రంలో సాగు నీరందక, కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారని ఆవేద న వ్యక్తంచేశారు.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి డిమాండ్
- రాయపర్తిలో రాస్తారోకో
రాయపర్తి, అక్టోబర్ 29: కాంగ్రెస్ సర్కా ర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. వరంగల్ జిల్లా రాయపర్తిని కరువు మం డలంగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతోనే రాష్ట్రంలో సాగు నీరందక, కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారని ఆవేద న వ్యక్తంచేశారు.
వరంగల్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశా రు. రైతాంగంతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికసాయం అందించి, మూగ జీ వాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాయపర్తిలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదుపై పార్టీ శ్రేణులతో సమీక్షలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. శాసనమండలి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టభద్రులంతా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

