రేవంత్ వైఫల్యంతోనే కరువు
బ్రోకర్ మాటలు చెప్పి, ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను నిండా ముంచుతున్నారని, ఆయన పాలనలో ప్రజల బతుకులు దర్భరంగా మారాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు.
- తెలివితక్కువ తనంతో ప్రజలకు కష్టాలు
- ప్రింటింగ్‌ప్రెస్ కిరాయి ఎగ్గొట్టిన చరిత్ర నీది
- ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫైర్
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : బ్రోకర్ మాటలు చెప్పి, ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను నిండా ముంచుతున్నారని, ఆయన పాలనలో ప్రజల బతుకులు దర్భరంగా మారాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలివి తక్కువగా ఆలోచించి నీళ్లెత్తకుండా నిర్లక్ష్యం చేసి కరువును ప్రజలపై రుద్దారని మండిపడ్డారు. మూడేండ్లలో చెప్పుకొనేందుకు చేసిందేమీలేక కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు తనపై కూడా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీ చరిత్ర ఏందో ప్రజలందరికీ తెలుసు. ప్రింటింగ్ ప్రెస్పెట్టి రెంట్ ఎగ్గొట్టిన నీకు మా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?’ అని ప్రశ్నించారు. తాను ప్రజల మద్దతుతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి, మంత్రిగా విప్లవాత్మక నిర్ణయాల్లో భాగస్వామినయ్యానని పేర్కొన్నారు. అలాంటి తననుద్దేశించి మరోసారి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఆధారాలు సహా రేవంత్‌రెడ్డి చేసిన చిల్లర పనులు బయటపెడుతానని హెచ్చరించారు.
సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లలో కేసీఆర్ ఏమీ చేయలేదని బదనాం చేయడం దుర్మార్గమని విమర్శించారు. పదేండ్లకు ముందు తెలంగాణ ఎట్లుండే.. కేసీఆర్ పాలనలో ఎట్లున్నదో ప్రజలందరికీ తెలుసనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏడు గంటల కరెంటు కూడా వచ్చేది కాదని, ప్రతిపక్షంలో ఉన్న తాము ఎండిన పంటలు, కాలిపోయిన మోటర్లు అసెంబ్లీకి తెచ్చి ధర్నాలు చేస్తే. ఆ ధర్నాలో రేవంత్‌రెడ్డి కూడా కూర్చున్నారని గుర్తుచేశారు. నాడు మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాడితే, రేవంత్‌రెడ్డి వెన్నుచూపి పారిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టారని, 24 గంటల కరెంటు ఇచ్చి ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని కొనియాడారు. నాడు కేసీఆర్ హయాంలో ఎక్కడా కరువు మండలాలు లేవని, దేవాదుల వద్ద బరాజ్ లేకున్నా నీళ్లు ఎత్తిపోశామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ కరువు నష్టం ఇవ్వాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.
మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర
కేసీఆర్ కట్టిన కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. లక్షల క్యూసెక్కుల వరద వెళ్లినా దెబ్బతినని మేడిగడ్డ బరాజ్ కేవలం కొద్దిపాటి వరద ఉన్నప్పుడు కుంగిపోవడంపై అనుమానం వ్యక్తంచేశారు. మేడిగడ్డ కుంగిన రోజు బాంబు పేలిన శబ్దం వచ్చిందని అక్కడి రైతులు చెప్తున్నారని పేర్కొన్నారు. కరోనా కాలంలో అన్ని రాష్ట్రాలు చేతులెత్తేస్తే కేసీఆర్ ధైర్యంగా ఎదుర్కొన్నారని, కార్మికులు, కర్షకులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి మాత్రం కరువు వస్తే ప్రతిపక్షంపై నెపంనెట్టి చేతులెత్తేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్‌రెడ్డీ.. దేవాదుల ద్వారా నీరందిస్తే పాలకుర్తిని కరువు మండలంగా ఎందుకు ప్రకటించావు?’ అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాలకు రావాలని సవాల్ చేశారు. మూడేండ్లలో ఉద్ధరించిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్ని జన్మలెత్తినా మళ్లీ గెలువడని, కొడంగల్‌లోనూ డిపాజిట్ గల్లంతవడం ఖాయమని పేర్కొన్నారు. మూడేండ్లలో ప్రజలకు చేసిన మేలు, నెరవేర్చిన హామీల గురించి చెప్పకుండా కేటీఆర్ గడ్డం గురించి అడ్డదిడ్డంగా మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

