దావత్లో లిక్కర్‌పై ఎక్సైజ్ నజర్
దావత్‌లలో ‘సిట్టింగ్' వేయాలంటే ఇక తప్పనిసరిగా ఎక్సైజ్‌శాఖ అనుమతి తీసుకోవాల్సిందే! అక్కడ ఏదైనా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కనిపిస్తే ఉపేక్షించేది లేదని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం హెచ్చరించింది.
- ఎన్డీపీఎల్ కోసం సరిహద్దుల్లో డ్రైవ్‌లు
- 4 నెలల్లో 302 కేసులు
- అక్రమ మద్యం తెస్తే చర్యలు
- ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హెచ్చరిక
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : దావత్‌లలో ‘సిట్టింగ్’ వేయాలంటే ఇక తప్పనిసరిగా ఎక్సైజ్‌శాఖ అనుమతి తీసుకోవాల్సిందే! అక్కడ ఏదైనా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కనిపిస్తే ఉపేక్షించేది లేదని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం హెచ్చరించింది. విదేశాల నుంచో, ఇతర రాష్ర్టాల నుంచో మద్యం అక్రమంగా తెచ్చి ఫంక్షన్లు చేసినా, ప్రైవేట్ పార్టీలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు పెరుగుతుండడంతో ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ ఫంక్షన్లు, పార్టీలు జరిగినా అక్కడ ‘సిట్టింగ్’ ఆప్షన్ ఉంటే తప్పనిసరిగా మఫ్టీలో నిఘా పెట్టాలని ఆదేశించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, 100 నుంచి 200 మంది ఆపై హాజరయ్యే ప్రతి ఫంక్షన్లోనూ తప్పనిసరిగా నిఘా పెట్టాలని సూచించారు.
సిట్టింగ్‌కు పర్మిషన్ తీసుకోవాలి
ఫంక్షన్లలో మద్యం సిట్టింగ్ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కన్నుంచో మద్యం దొంగచాటుగా తీసుకొస్తే ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఏడు ఏప్రిల్ వరకు 302 కేసులు న మోదు చేశాం. 165 మందిని అదుపులోకి తీసుకున్నాం. 35 వాహనా లు సీజ్ చేసి, 61.13 లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశాం. ఇకనుంచి స్పెషల్ డ్రైవ్‌లపై దృష్టిపెట్టాలి. లేకపోతే అధికారులపై చర్యలు తప్పవు.
– వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

