సబ్‌స్టేషన్‌లోనే సిట్టింగ్
విద్యుత్‌శాఖ అధికారులు ఏకంగా సబ్‌స్టేషన్‌లోనే మందు సిట్టింగ్ పెట్టారు. ఈ దావత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో వారంతా అవాక్కయ్యారు. వి
- జగిత్యాల టౌన్-1 ఆఫీస్లోదావత్
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- ముగ్గురి లైన్మెన్ల సస్పెన్షన్
జగిత్యాల, నవంబర్ 16: విద్యుత్‌శాఖ అధికారులు ఏకంగా సబ్‌స్టేషన్‌లోనే మందు సిట్టింగ్ పెట్టారు. ఈ దావత్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో వారంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్-1 సబ్‌స్టేషన్ కార్యాలయం స్టాఫ్‌రూమ్‌లో శనివారం రాత్రి అసిస్టెంట్ లైన్‌మె న్లు ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ మద్యం తాగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ కాగా విధినిర్వహణలో ఉండాల్సిన ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయంలోనే మద్యం సేవించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాథమిక విచారణలో మందు పార్టీ చేసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ముగ్గురు అసిస్టెంట్ లైన్మెన్లను సస్పెండ్ చేస్తున్నట్టు జగిత్యాల డి విజినల్ ఇంజినీర్ గంగారాం పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి హెచ్ఆర్డీ విభాగం నుంచి అడ్వయిజరీ మెమో జారీ చేసినట్టు ఆయన తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

