ఓటరు పేరు తొలగిస్తే కారణాలు వివరిస్తాం.. హైకోర్టుకు ఎన్నికల సంఘం వివరణ
ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన వారి పేర్లను తుది జాబితా నుంచి తొలగిస్తే అందుకు కారణాలను వివరిస్తూ ఉత్తర్వులు జారీచేస్తామని భారత ఎన్నికల సంఘం హైకోర్టుకు స్పష్టంచేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన వారి పేర్లను తుది జాబితా నుంచి తొలగిస్తే అందుకు కారణాలను వివరిస్తూ ఉత్తర్వులు జారీచేస్తామని భారత ఎన్నికల సంఘం హైకోర్టుకు స్పష్టంచేసింది. నోటీసులకు స్పందించి విచారణకు హాజరై, వివరాల్లో వ్యత్యాసాలను సరిచేసేందుకు అవసరమైన పత్రాలు సమర్పించిన ఓటర్ల విషయం లో ఈ విధానం అనుసరిస్తామని తెలిపింది.
కారణాలతో కూడిన ఉత్తర్వులపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని, ఒకవేళ ఎలాంటి ఉత్తర్వు లు జారీ చేయకపోతే సంబంధిత ఓట రు పేరు జాబితాలో ఉన్నట్టుగా పరిగణించవచ్చని వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఎస్క్యూ మసూద్, ఆయన సోదరుడు సయ్యద్ వహీదుద్దీన్ చేసిన ఫిర్యాదులను పరిషరించామని తెలిపింది. మరికొన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయ ని ఈసీ తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ ధర్మాసనానికి వివరించారు.
దరఖాస్తు ఆమోదిస్తే జాబితాలో పేరు
ఈసీఐ.నెట్, ఈఆర్ ఓనెట్ అప్లికేషన్ల ద్వారా ఆటోమేటిక్ డాటా మ్యాచింగ్ విధానంలో ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలను గుర్తించి నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ మసూద్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శామ్‌కోషి, జస్టిస్ నందికొండ నర్సింగరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఆయన దరఖాస్తును ఆమోదిస్తే తుది జాబితాలో పేరు ప్రచురిస్తామని, లేదంటే దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

