ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సరళిపరిశీలనకు అధికారులు
త్వరలో తెలంగాణలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల నమోదును పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. తెలంగాణలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరిలో ఓటర్ల నమోదు సరళిని పరిశీలించేందుకు తెలంగాణ మున్సిపల్‌శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి, వికారాబాద్-మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ప్లానింగ్‌శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వనపర్తి-జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు రోడ్లు-భవనాలశాఖ కార్యదర్శి ఇలంబర్తిని నియమించారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): త్వరలో తెలంగాణలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల నమోదును పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. తెలంగాణలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరిలో ఓటర్ల నమోదు సరళిని పరిశీలించేందుకు తెలంగాణ మున్సిపల్‌శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి, వికారాబాద్-మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ప్లానింగ్‌శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, వనపర్తి-జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు రోడ్లు-భవనాలశాఖ కార్యదర్శి ఇలంబర్తిని నియమించారు.
వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు సెర్ప్ సీఈవో డీ దివ్య, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు దాసరి హరిచందన, వరంగల్, హనుమకొండ, జయశంకర్భూపాలపల్లి జిల్లాలకు బీ విజయేంద్రను పరిశీలకులుగా నియమించారు. ఇక ఏపీలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో ఏ సూర్యకుమారి, ఎంబీ శేషగిరిబాబును, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి ముత్యాలరాజు, షాన్మోహన్ను నియమించారు. వీరు ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ల జాబితా రూపకల్పనపై దృష్టి సారించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

