సరస్వతికి లక్ష్మీకటాక్షం
రాష్ట్ర బడ్జెట్లో విద్యరంగానికి ప్రాధాన్యం దక్కింది. 2023 -24 వార్షిక బడ్జెట్లో విద్యకు ప్రభుత్వం కేటాయింపులను గణనీయంగా పెంచింది.
- బడ్జెట్లో విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
- నిరుడుతో పోల్చితే 3 వేల కోట్లు అదనం
- ఏటా గణనీయంగా కేటాయింపుల పెంపు
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో విద్యరంగానికి ప్రాధాన్యం దక్కింది. 2023 -24 వార్షిక బడ్జెట్లో విద్యకు ప్రభుత్వం కేటాయింపులను గణనీయంగా పెంచింది. నిరుడు రూ.16 వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.19 వేల కోట్లకు పెంచింది. అంటే, ఈసారి మొత్తం రూ.3 వేల కోట్లను అదనంగా కేటాయించింది. ప్రతి ఏటా ప్రభుత్వం సెకండరీ విద్య, ఉన్నత విద్యకు ప్రభుత్వం కేటాయింపులను పెంచుతూనే ఉన్నది. మూడేండ్లుగా ఏటా 2 వేల కోట్లకు పైగా నిధులను అదనంగా కేటాయిస్తూ వస్తున్నది. సాంకేతిక విద్యపై కూడా అధిక శ్రద్ధ చూపింది. రాష్ట్రంలోని 26 వేల బడుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు ప్రభుత్వం ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
కొన్ని ముఖ్యాంశాలు
- నిరుడు బడ్జెట్లో స్కాలర్షిప్లు, డైట్ చార్జీలకు రూ. 4,690 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది రూ. 5,609 కోట్లను కేటాయించింది.
- 21,868 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను సరఫరా చేయనున్నది.
- మహబూబ్‌నగర్, కొత్తగూడెంలో ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరు చేయనున్నది.
- గత ఏడాది సమగ్రశిక్ష ప్రాజెక్ట్‌కు రూ. 1,445 కోట్లు కేటాయించగా, ఈ విద్యాసంవత్సరం రూ.1,874 కోట్లకు పెంచారు. మేజర్ సివిల్ వర్క్స్‌కు రూ.263 కోట్లు కేటాయించారు.
- కళాశాల విద్యకు రూ.42.34 కోట్లు, ఇంటర్ విద్యకు రూ. 13.13 కోట్లు, సాంకేతిక విద్యకు రూ. 37.32 కోట్ల నిధులను కేటాయించారు.
- తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి నిరు డు రూ.1,369 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ. 1,883 కోట్లు కేటాయించారు. 48 హాస్టల్ భవనాల నిర్మాణానికి రూ.75.94 కోట్లు కేటాయించారు.
- మధ్యాహ్న భోజనానికి 1-8 తరగతులకు రూ. 596.46 కోట్లు, 9,10 తరగతులకు రూ. 148.78 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

యూనివర్సిటీ విద్యకు భరోసా
- బడ్జెట్లో తొలిసారిగా 500 కోట్ల నిధులు
- ఉస్మానియా వర్సిటీకి రూ.457.10 కోట్లు
- మహిళా యూనివర్సిటీకి రూ.100 కోట్లు
- హాస్టళ్లు, కొత్త భవనాల నిర్మాణానికి..
హైదరాబాద్/ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మానవ వనరులను తయారుచేసే ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లను ప్రతిపాదించింది. ఇలా వర్సిటీల్లో వసతుల కల్పనకు భారీగా నిధులివ్వడం ఇదే తొలిసారి. 2004 తర్వాత తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. అయితే, వసతుల కల్పనను అప్పటి ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. నిధుల లేమితో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితికి చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రభుత్వం వర్సిటీలకు భారీగా నిధులను కేటాయించింది. గతేడాది రూ.100 కోట్లతో మహిళా వర్సిటీని ఏర్పాటు చేయగా, ఈ ఏడాది సైతం రూ.100 కోట్లు కేటాయించింది.
ఉస్మానియాకు నాలుగు రెట్ల నిధులు
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సర్కారు భారీగా నిధులను పెంచింది. 2010-11లో ఉమ్మడి ప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్ కింద రూ.93 కోట్లను కేటాయించగా, 2014 బడ్జెట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.219. 24 కోట్లకు పెంచింది. 2022- 23 బడ్జెట్లో రూ.418.06 కోట్లను పెంచింది. 12 ఏండ్ల కాలంలో ఓయూకు నిధులను నాలుగు రెట్లు పెంచింది. తాజా బడ్జెట్లో రూ.457.10 కోట్లు కేటాయించింది.
ఫార్మాహబ్‌గా జేఎన్టీయూ సుల్తాన్పూర్
ఫార్మా రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. జేఎన్టీ యూ సుల్తాన్పూర్ క్యాంపస్‌ను ఫార్మాహబ్‌గా చేయనున్నట్టు జేఎన్టీయూ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ గతంలో ఇంజినీరింగ్ కోర్సులను మాత్రమే నిర్వహించగా, గత ఏడాది బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులను ప్రారంభించారు. తాజాగా ఫార్మాహబ్ ఏర్పాటుతో మరికొన్ని కొత్త కోర్సులను ప్రారంభిస్తారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

