ఫీజుల కోసం ఒత్తిడిచేయొద్దు

- 3, 4 వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చు
- వృత్తి విద్యాకాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కరోనా, లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వృత్తి విద్యాకాలేజీలు, విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడిచేయవద్దని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ఫీజు మొత్తాన్ని మూడు లేదా నాలుగు వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చని పేర్కొన్నది. పరిస్థితులు కుదుటపడే వరకు ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించింది. ఈ సమాచారాన్ని కాలేజీలు వెబ్సైట్లలో పొందుపరచడంతోపాటు ఈ మెయిల్ ద్వారా విద్యార్థులకు చేరవేయాలని తెలిపింది. ఈ మేరకు ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ ఎస్ సహస్రబుద్దే మంగళవారం ఓ సర్క్యులర్ జారీచేశారు.
సర్క్యులర్ ముఖ్యాంశాలిలా..
- అధ్యాపకులు, ఫ్యాకల్టీని విధుల నుంచి తొలగించరాదు. క్షమశిక్షణ ఉల్లంఘించిన వారిని తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరినీ తీసివేయొద్దు. అధ్యాపకులు, సిబ్బందికి నెల నెల వేతనాలు చెల్లించాలి. లాక్డౌన్ సమయంలో తొలగించిన వారిని సైతం విధుల్లోకి తీసుకోవాలి.
- ఇంటర్నెట్, వైఫై సౌకర్యంలేని విద్యార్థులకు కాలేజీలు, విద్యాసంస్థల్లోని ఇంటర్నెట్ను వినియోగించుకొనే సౌకర్యం కల్పించాలి. తమతోపాటు ఇతర కాలేజీల విద్యార్థులకు సైతం ఈ అవకాశాన్ని కల్పించాలి.
- లాక్డౌన్కాలంతోపాటు ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపునివ్వాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

