రేవంత్ పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి.. డాలస్‌లో బీఆర్ఎస్ శ్రేణులతో మాజీమంత్రి ఎర్రబెల్లి
తెలంగాణలో రాక్షసపాలన నడుస్తున్నదని, రేవంత్‌రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి రగులుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆట మహాసభలకు అమెరికా వెళ్లిన ఆయన డాలస్ నగరంలో శనివారం బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులతో సమావేశమయ్యారు.
దేవరుప్పుల, జూన్ 20 : తెలంగాణలో రాక్షసపాలన నడుస్తున్నదని, రేవంత్‌రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి రగులుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆట మహాసభలకు అమెరికా వెళ్లిన ఆయన డాలస్ నగరంలో శనివారం బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రైతాంగం అష్టకష్టాలు పడుతున్నదని అన్నారు. సాగునీరు అందక, పండిన పంట కొనక, ఎరువులు దొరక్క, రైతు భరోసా ఇవ్వకపోవడంతో ఆగమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలకులు దోచుకొనుడు, దాచుకొనుడు పాలసీతో ముందుకు సాగుతున్నారని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే తాను ఇచ్చానని రేవంత్ చెప్పుకొంటున్నారని, ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కేసీఆర్ పథకాలన్నీ అటకెక్కాయని, కనీసం రైతుబీమాకు డబ్బులు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు సత్యం, యాదగిరి, శశి అవిరినేని, అభిషేక్ రంగినేని పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

