Palla Rajeshwar Reddy | పార్టీ మారాలని ప్రభుత్వం ఒత్తిడి
Palla Rajeshwar Reddy | పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తున్నదని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వేధింపుల్లో భాగంగా ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదుచేశారని, తనతోపాటు తన భార్య నీలిమ, కొడుకు అనురాగ్పైనా కేసులు పెట్టారని తెలిపారు. వాటికి భయపడబోనని, న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు.
- నాతోపాటు భార్య, కొడుకుపైనా కేసులు
- ఆరు నెలల్లో నాలుగైదు కేసులు పెట్టారు
- కేసులు కొత్తకాదు.. పార్టీ మారే ప్రసక్తే లేదు
- జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా వెల్లడి
- జనగామ ఎమ్మెల్యే పల్లా ఫైర్
- అమెరికాలోని వర్జీనియాలో మీట్ అండ్ గ్రీట్
Palla Rajeshwar Reddy | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తున్నదని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వేధింపుల్లో భాగంగా ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదుచేశారని, తనతోపాటు తన భార్య నీలిమ, కొడుకు అనురాగ్పైనా కేసులు పెట్టారని తెలిపారు. వాటికి భయపడబోనని, న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, కేసులు, అరెస్టులు తనకు కొత్త కాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కక్షపూరిత రాజకీయాలను ప్రారంభించారని, ఇప్పటివరకు ఇలాంటి వాతావరణం ఇక్కడ లేదని తెలిపారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్లోకి రాకముందు ఉద్యమంలో జేఏసీతో కలిసి పనిచేశానని, నాడు ఉమ్మడి పాలకులు కేసులు పెట్టారని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని, గెలిచిన పార్టీ ఐదేండ్లు అధికారంలో ఉండాలని సూచించారు.
అలవికాని హామీలతో అధికారంలోకి
అబద్ధాలు చెప్పి, అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైందని రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌కు శ్వాస, ధ్వాస తెలంగాణేనని, తన పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని తలెత్తుకొని నిలబడేలా చేశారని గుర్తుచేశారు. కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్ అని, నిపుణుల సలహాతోనే దానిని నిర్మించారని తెలిపారు. అవగాహన లేమితో కాళేశ్వరంపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమెరికా వర్సిటీల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని తెలిపారు. ఇక్కడి వర్సిటీల్లో 30 శాతం మంది విద్యార్థులు భారతీయులేనని చెప్పారు. అందులోనూ తెలుగువాళ్లు అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇటు విద్య, అటు ఉద్యోగం విషయాల్లో మన వాళ్లపైనే విదేశీ యూనివర్సిటీలు ఆధార పడుతున్నాయని, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. మీట్ అండ్ గ్రీట్‌లో ఆటా ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా మాజీ అధ్యక్షుడు భువనేశ్ భుజాల, రామ్మోహన్ కొండ, జీటీఏ చైర్మన్ కలవల విశ్వేశ్వరరెడ్డి, రవి పల్లా, స్థానిక తెలుగు సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

