పౌరుల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖలో సంస్కరణలు: డీజీపీ మహేందర్ రెడ్డి
DGP Mahender reddy | శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే ముందంజలో
హైదరాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender reddy) అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే ముందంజలో ఉన్నామని చెప్పారు. ఒకే రాష్ట్రం, ఒకే సేవ అనే సూత్రంతో స్నేహపూర్వక సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జవాబుదారీతనం, పారదర్శకత, బాధ్యతాయుత పోలీసు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నేరం చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేని విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పౌరుల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.
విధినిర్వహణలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులు అర్పిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది 264 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు వ్యవస్థ ముందుండటం గర్వంగా ఉందని డీజీపీ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

