DGP Anjani kumar | మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా: డీజీపీ అంజనీకుమార్
మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహించారు.
- సరిహద్దు ప్రాంతాలపై పర్యవేక్షణ
- ఆన్లైన్ వర్క్‌షాప్‌లో పోలీస్ అధికారులతో కీలక చర్చలు
DGP Anjani kumar | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహించారు.
గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీంతోపాటు ఇతర అధికారులతో కలిసి డీజీపీ కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రముఖు లు, వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని డీజీపీ సూ చించారు.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీంల కదలికలు పెరిగే అవకాశం ఉన్నదని, ఆ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీసుల నిరంతర కృషితో తెలంగాణలో మావోయిస్టులు అంతరించిపోయారని తెలిపారు. రాష్ట్రంలో 80% కొత్తగా విధుల్లో చేరిన పోలీసులు ఉండటం వల్ల మావోయిస్టుల వ్యూహా లు, చర్యలు, దాడులపై మరింత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. పోలీసు ద ళాల కదలికల్లో మార్పులు, వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మారుస్తుండాలని ఆపరేషన్స్ అదనపు డీజీపీ విజయ్‌కుమార్ సూచించారు. తీవ్రవాద పరిస్థితులు, తీసుకొనే భద్రతా చర్యలను ఐజీ ప్రభాకర్‌రావు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

