Farmers Protest | పంచాయతీ కార్యాలయంలో నీటిపారుదల అధికారుల నిర్బంధం
Farmers Protest | నిజాంసాగర్ కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను రైతులు నిర్బంధించారు.
బోధన్ రూరల్ : నిజాంసాగర్ (Nizamsagar ) కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను ( Irrigation Officers ) రైతులు (Farmers) నిర్బంధించారు. నిజాంసాగర్ డి 28 కెనాల్ లో నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులు కెనాల్‌ను పరిశీలించడానికి శుక్రవారం గ్రామానికి వచ్చారు.

దీంతో ఆగ్రహించిన రైతులు నిజాంసాగర్ కెనాల్ నీటిని విడుదల చేసి వారం రోజులు కావస్తున్న కింది ఆయకట్టుకు నీళ్లు రాకపోవడంతో రైతులు ఇరిగేషన్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. నిజాంసాగర్ కెనాల్ నీరు చివరి ఆయకట్టు వరకు అందకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరిగేషన్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో తాళం వేశామని రైతులు చెప్పారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ సీఐ విజయబాబు, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, సంఘటన స్థలాన్ని చేరుకొని రైతులతో మాట్లాడి సముదాయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

