దళిత దైవం సీఎం కేసీఆర్

- హుజూరాబాద్‌లో ఇంటింటా దళితబంధు గురించి వివరిస్తాం
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి
ఖైరతాబాద్, జూలై 20: దళితుల సాధికారితకు అహర్నిషలు కృషిచేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పేర్కొన్నారు. దళితులు ఆయనను జీవితాంతం దైవంలా కొలుస్తారని, ఆయన వెంటే ఉంటారని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత వాడల్లో ఇంటింటికీ వెళ్లి ఈ పథకం గురించి ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. ఎంహెచ్పీఎస్, మహా ఎమ్మార్పీఎస్, టీఎంఎస్‌ఎస్, మాల మహానాడు, ప్రజా సంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల సమాఖ్య, తెలంగాణ దళిత దండు, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ జేఏసీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో మంగళవారం తెలంగాణ దళితబంధు పథకంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. దళితబంధు తేవడం ద్వారా సీఎం కేసీఆర్ ఆ జాతులకు ఆత్మబంధువయ్యారని పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- dalith
- dalitha bandhu
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab CM | రోడ్డు ప్రమాద మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన భగవంత్ మాన్..!
Woman murdered in trial room | బట్టల షాప్‌లోని ట్రయల్ రూమ్‌లో ఉద్యోగిని మృతదేహం.. ఆమెను హత్య చేసిన యువకుడు అరెస్ట్
Mahesh Bigala | దీక్షా దివాస్ వేడుకలకు సిద్ధం కావాలి.. బీఆర్ఎస్ ఎన్నారై శాఖలకు మహేష్ బిగాల పిలుపు
Cancer | భారత్‌లో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. ముందస్తుగా గుర్తించడం అవసరం అంటున్న నిపుణులు..
man kills live-in partner’s dogs | బ్రేకప్ చెప్పిందని.. సహజీవనం చేసిన మహిళ పెంపుడు కుక్కలను చంపిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

