దూసుకొస్తున్న మురసు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మురసు తుపాను మరింత బలపడుతున్నది. మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నదని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
- దక్షిణ తెలంగాణ జిల్లాలకు భారీ నుంచి అతి భారీవర్ష సూచన
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మురసు తుపాను మరింత బలపడుతున్నది. మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నదని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రా ద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలతోపాటు నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకా శం ఉన్నదని పేర్కొన్నది.
‘మురసు’ ఎఫెక్ట్‌తో పలు రైళ్లు రద్దు
‘మురసు’ ఎఫెక్ట్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్ల సర్వీసులు రద్దు చేసింది. సోమ, మంగళవారాల్లో నడవాల్సిన తొమ్మిది రైళ్ల సర్వీసులు నిలిపివేసింది. వీటిలో విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ, గుంటూరు-తెనాలి, తెనాలి-గుంటూరు రైళ్లు ఉన్నాయి. మంగళవారం నడవాల్సిన రేపల్లె-మారాపురం రోడ్, మారాపురం రోడ్-రేపల్లె రైలు సర్వీసులు రద్దు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

