President Tour | తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
President Tour | ఈ నెల 17 నుంచి ఐదురోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్ తెలిపారు.
President Tour | ఈ నెల 17 నుంచి ఐదురోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగలను పట్టుకోవానికి ముందుస్తు ఏర్పాట్లు చేయాలని జీఎంహెచ్ఎంసీని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడింగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

