CP CV Anand | సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సీపీ సీవీ ఆనంద్
CP CV Anand | సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
CP CV Anand | సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలన్నారు. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన నోటీసుల్లో ఆదేశించారు. పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రీమియర్ షోకు హీరో అల్లు అర్జున్ రాగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా.. ఓ మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదిలా ఉండగా.. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను కిమ్స్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ శాఖ హెల్త్ సెక్రటరీ క్రిస్టినాతో కలిసి సీపీ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడ్డాడు. అల్లు అర్జున్ పుష్ప-2 ప్రీమియర్ షోకురాత్రి 9:30 గంటకు సంధ్య థియేటర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో చాలామంది అభిమానులు థియేటర్లోకి దూసుకువచ్చారు. భాస్కర్ అనే వ్యక్తి, అతని రేవతి, కొడుకు శ్రీతేజ్ ఉన్నారు. హీరో అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి అభిమానులంతా తోసుకురాగా.. శ్రీతేజ్ పరుగెత్తాడు. బాలుడిని పట్టుకునేందుకు తల్లి రేవతి వెళ్లింది.
అదే సమయంలో శ్రీతేజ్ కిందపడగా అభిమానులంతా తొక్కుకుంటూ వెళ్లిపోయారు. శ్రీతేజ్‌ను కాపాడుకునే రేవతి ప్రయత్నించింది. ఇద్దరూ ప్రేక్షకుల కాళ్లకింద నలిగిపోయారు. అరుపులు, కేకలు విని పోలీసులు అందరినీ చెదరగొట్టారు. రేవతి స్పృహ తప్పగా.. శ్రీతేజ్‌కు సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ డీడీ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే రేవతి చనిపోయింది. బాలుడిని కిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారంలో పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. బన్నీతో పాటు పలువురిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

